tarak: చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఎవరో కొడితే.. మనోజ్ వెళ్లి అతని చేయి విరగ్గొట్టాడట!

  • చిన్నప్పుడు తారక్ కోసం సాహసం
  • విషయాన్ని క్లియర్ గా చెప్పాలన్న అభిమాని
  • తారక్ నే అడగాలంటూ మనోజ్ రిప్లై
సోషల్ మీడియాలో హీరో మంచు మనోజ్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. అభిమానులు అడిగే పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తుంటాడు. పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. స్నేహం కోసం ఏమి చేయడానికైనా మనోజ్ వెనుకాడడు. ఇటీవల నందమూరి హరికృష్ణ మరణం సమయంలో కూడా కల్యాణ్ రామ్, తారక్ లకు మనోజ్ అండగా నిలిచాడు.

అంతేకాదు... తారక్ కోసం చిన్నప్పుడే మనోజ్ ఓ సాహసం చేశాడట. తారక్ ను ఎవరో కొడితే... మనోజ్ అతని వద్దకు వెళ్లి చేయి విరగ్గొట్టాడట. ఈ కథ ఏందో పూర్తిగా చెప్పాలని ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా మనోజ్ ను కోరాడు. దీనికి సమాధానంగా, 'తారకే నే అడుగు. నా కంటే అతనే బాగా చెబుతాడు' అని రిప్టై ఇచ్చాడు.
tarak
junior ntr
manchu manoj

More Telugu News