నోబెల్ శాంతి బహుమతి కోసం మోదీ పేరును ప్రతిపాదిస్తున్న తమిళనాడు బీజేపీ చీఫ్!
- మోదీని నామినేట్ చేసిన తమిళనాడు బీజేపీ చీఫ్
- ఆయుష్మాన్ భారత్ పథకంతో కోట్లాది మందికి ఆరోగ్య భరోసా
- మోదీకి అందరూ మద్దతివ్వాలని కోరిన సౌందరరాజన్
ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద హెల్త్ కేర్ స్కీమ్ గా ఆయుష్మాన్ భారత్ పథకం శనివారం నుంచి అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న 13 వేల ఆసుపత్రులు ఈ స్కీమ్ పరిధిలో ఉంటాయి. సుమారు 50 కోట్ల మంది ప్రజలకు లబ్ధి కలుగుతుంది. ఈ పథకం గురించిన మరిన్ని వివరాల కోసం హెల్ప్ లైన్ నంబర్ 14555 కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ప్రతిఒక్కరూ నామినేషన్లు వేయాలని సౌందరరాజన్ పిలుపునిచ్చారు.