ఆసియా కప్ ఎఫెక్ట్.. మాథ్యూస్ ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన శ్రీలంక బోర్డు!
- తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన క్రికెటర్
- జట్టు మొత్తం విఫలమైతే తానెలా కారణమవుతానని ప్రశ్న
- కెప్టెన్సీ మార్పుపై వివరణ ఇచ్చిన బోర్డు
ఆసియా కప్ లీగ్ దశలో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్ల చేతిలో ఓడిపోయిన శ్రీలంక ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాథ్యూస్ ను తొలగించడంతో అతను బోర్డుకు లేఖ రాశాడు. అయితే ఈ వివాదంపై స్పందించిన శ్రీలంక క్రికెట్ బోర్డు జట్టు వైఫల్యం కారణంగా కెప్టెన్ ను మార్చలేదని స్పష్టం చేసింది. త్వరలో జట్టు ఇంగ్లండ్ లో పర్యటించనున్న నేపథ్యంలో టీ20, వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీ బాధ్యతలను దినేశ్ చండీమాల్ కు అప్పగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.