మావోయిస్టులకు నాయకత్వం వహించింది చైతన్య అలియాస్ అరుణ!
- దాడికి పాల్పడింది నందాపూర్ ఏరియా కమిటీ
- మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య అరుణ నాయకత్వం?
- స్వరూప, సునీల్ ఆధ్వర్యంలో మహిళా మావోయిస్టులు
ఈ దళానికి చైతన్య అలియాస్ అరుణ నాయకత్వం వహించినట్టు పోలీసులు చెబుతున్నారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా నారాయణపట్నం ఏరియా కమిటీ బాధ్యతలను ఆమె చూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అరుణను చలపతి భార్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో డివిజనల్ కమిటీ మెంబర్ రింకి అలియాస్ స్వరూప, రైనో అలియాస్ సునీల్ ఆధ్వర్యంలో మహిళా మావోయిస్టులు ఉన్నారని పోలీసులు తెలిపారు.