బావను ప్రేమించి... తప్పు తనదేనని... యువతి ఆత్మహత్య!
- బాసర ఆర్జీయూకేటీలో చదువుతున్న అనూష
- బావను ప్రేమించి, ఆపై మనస్పర్థలు
- బావ తప్పులేదని చెబుతూ సూసైడ్
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను, నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పక్కటెముకలు విరిగిన కారణంగా తీవ్రగాయాలతో మరణించింది. మరణానికి ముందు అనూష రాసిన సూసైడ్ లెటర్ లోని వివరాల ప్రకారం, ఆమె తన బావ వరుసైన నాగరాజును ప్రేమించింది. ఎందుకో వారిమధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. బావ లేకుండా తాను బతకలేనని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పిన ఆమె, బావ చాలా మంచోడని, తానే తప్పు చేశానని చెప్పింది. నాగరాజును ఏమీ అనవద్దని కోరింది. లేఖను పరిశీలిస్తున్నామని, కేసు దర్యాఫ్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.