గదిలో మందుకొట్టి గోల... చూద్దామని వెళితే రేప్ చేసేందుకు చూసిన ఏడుగురు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గదిలో మందుకొట్టి గోల... చూద్దామని వెళితే రేప్ చేసేందుకు చూసిన ఏడుగురు!

  • న్యూఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ లో ఘటన
  • విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన యువతి
  • తొంగిచూస్తే లోపలికి లాగే ప్రయత్నం చేసిన యువకులు
ఆఫీసులో పని చేసుకుని ఇంటికి చేరుతున్న ఓ యువతి, తమ అపార్టుమెంట్లలోని ఓ ప్లాట్ లో జరుగుతున్న గోలను చూసేందుకు వెళ్లి అత్యాచారయత్నానికి గురైంది. ఈ ఘటన న్యూఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్, మనేసర్ పారిశ్రామికవాడలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, రాత్రి 10 గంటల సమయంలో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న యువతి, విధులు ముగించుకుని, ఇంటికి వచ్చి మెట్ల మార్గం ద్వారా రెండో అంతస్తుకు వెళుతున్న వేళ, మొదటి అంతస్తులో కొందరు యువకులు మందు కొట్టి గొడవ చేస్తుండటాన్ని గమనించింది.

వారిపై ఫిర్యాదు చేయాలని భావించి, గదిలో ఎవరు ఉన్నారో చూద్దామని నెమ్మదిగా తొంగి చూడగా, ఆమె చేతిలోని లంచ్ బాక్స్ కిందపడింది. ఈ శబ్దాన్ని విన్న గది లోపలి యువకులు, ఆమెను గట్టిగా పట్టుకుని గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. వారితో పెనుగులాడి, అరుస్తూ, తప్పించుకున్న యువతి, తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గదిలో ఇంకా చాలామంది ఉన్నారని, వారిని కూడా అరెస్ట్ చేయాలని అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళన చేయడంతో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
New Delhi
Rape
Drinking
Apartment

More Telugu News