Uttam kumar reddy: ఉమ్మడి ఎజెండాకు కూటమిలోని అన్ని పార్టీలూ సానుకూలమే!: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • అయోమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్
  • 15 రోజుల ముందు మాత్రమే అభ్యర్థుల జాబితా 
  • సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక
ఉమ్మడి ఎజెండాకు మహాకూటమిలోని అన్ని పార్టీలూ సానుకూలంగానే ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మిత్రపక్షాలు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు కోరుతున్నట్టు తమ దృష్టికి రాలేదన్నారు. అలాంటిదేమైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఆయన అన్నారు.

నేడు విలేకరుల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కాస్త అయోమయంలో ఉందన్నారు. ఓటరు జాబితాల్లో తప్పులు.. ఓట్ల తొలగింపుపై భారీగా ఫిర్యాదుల కారణంగా ఈసీ అయోమయానికి గురవుతోందని ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు 15 రోజుల ముందే అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని ఉత్తమ్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారంతో ముగుస్తుందన్నారు. అభ్యర్థుల ఎంపికపై సర్వే చేపడతామని.. ఆ నివేదిక ఆధారంగానే ఎంపిక ఉంటుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. 
Uttam kumar reddy
election commission
voter list
contestants

More Telugu News