kumaraswamy: మా ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర వేస్తోంది: కర్ణాటక సీఎం కుమారస్వామి

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటక సీఎం కుమారస్వామి బీజేపీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బెంగళూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తోందని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల చొప్పున ఇవ్వజూపుతున్నారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను ముంబై, పూణెలకు తీసుకువెళ్లి, బలపరీక్ష సమయానికి తీసుకువచ్చేలా బీజేపీ ప్లాన్ చేస్తోందని కుమారస్వామి అనుమానం వ్యక్తం చేశారు. 
Go Back to Shorts
kumaraswamy

More Telugu News