జైసల్మేర్‌లో ప్రత్యేక విందుతో జీవిత భాగస్వామికి అక్షయ్ కుమార్ సర్ప్రైజ్
- హౌస్‌ఫుల్-4 షూటింగ్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు
- కుమార్తె నితారాతోపాటు వచ్చిన ట్వింకిల్ ఖన్నా
- అనుకోని ఆతిథ్యంతో ఆనందాశ్చర్యం
సాజిద్‌ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ కామెడీ చిత్రంలో అక్షయ్‌తోపాటు కృతిసనన్, బాబీ డియోల్, రితేష్ దేశ్‌ముఖ్, పూజాహెగ్డేలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలోని ముఖ్యమైన ఘట్టాలను జైసల్మేర్‌లో చిత్రీకరిస్తుండడంతో అక్కడ ఉన్న భర్తను కలుసుకునేందుకు కుమార్తె నితారాతోపాటు ట్వింకిల్ ఖన్నా రాజస్థాన్ వచ్చింది. ఈ సందర్భంగా అద్భుతమైన డిషెస్‌తో పార్టీ ఏర్పాటుచేసి అక్షయ్ ఆకట్టుకున్నాడట. ట్వింకిల్ రాసిన పుస్తకం అత్యధిక ఆదరణ పొందుతుండడంతో అక్షయ్ ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.