Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ కాంగ్రెస్ లో పలు మార్పులు.. రేవంత్ రెడ్డికి ప్రమోషన్

  • రేవంత్, పొన్నంలకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా
  • ప్రచార కమిటీ ఛైర్మన్ గా భట్టి విక్రమార్క
  • మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజనర్సింహ
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ... పార్టీ అధినేత రాహుల్ గాంధీ పలు మార్పులు చేశారు. టీపీసీసీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 9 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. 15 మందితో కోర్ కమిటీని ఏర్పరిచారు. టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పదోన్నతి లభించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు నియమితులయ్యారు.

ఇక ప్రచార కమిటీ ఛైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్క, కో-ఛైర్మన్ గా డీకే అరుణ, కన్వీనర్ గా దాసోజు శ్రవణ్ లను నియమించారు. 41 మందితో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. 53 మందితో కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. 17 మందితో ప్రచార కమిటీ, 35 మందితో మేనిఫెస్టో కమిటీ, 20 మందితో స్ట్రాటజీ కమిటీని ఏర్పాటు చేశారు.

మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు. స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ గా వి.హనుమంతరావు నియమితులయ్యారు. ఈసీ సమన్వయ కమిటీ ఛైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డిని, పార్టీ క్రమశిక్షణ చర్యల కమిటీ ఛైర్మన్ గా కోదండరెడ్డిని నియమించారు.
tpcc
revanth reddy
ponnam
bh
dk aruna

More Telugu News