అల్లుడు పారిపోయినా.. కూతురును తెగనరికిన తండ్రి!

  • హైదారాబాద్ గోకుల్ థియేటర్ వద్ద హత్యాయత్నం
  • బ్యాగులో నుంచి కత్తి తీసి విచక్షణారహితంగా దాడి
  • యువతి పరిస్థితి విషమం
హైదరాబాదులో కాసేపటి క్రితం చోటు చేసుకున్న పరువు హత్యాయత్నం సంచలనం రేపుతోంది. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వద్ద తన కుమార్తె మాధవి, ఆమె భర్త సందీప్ పై ఆమె తండ్రి కత్తితో హత్యకు యత్నించాడు. రోడ్డు పక్కన స్కూటీపై మాధవి, సందీప్ లు కూర్చొని ఉండగా, పక్కనే హెల్మెట్ పెట్టుకుని బైక్ పై వచ్చిన అమ్మాయి తండ్రి... బ్యాగులో నుంచి కత్తి తీసి, ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

తొలుత సందీప్ పై కత్తితో దాడి చేశాడు. అక్కడ నుంచి సందీప్ పారిపోవడంతో... కూతురును మరింత దారుణంగా నరికాడు. ఈ సందర్భంగా అతనిని అడ్డుకునే క్రమంలో ఒక సెక్యూరిటీ గార్డు కాలితో ఎగిరి తన్నాడు. అయితే, అతన్ని కూడా బెదిరించి, తన దాడిని కొనసాగించాడు. దాడిలో గాయపడ్డ సందీప్ ను స్థానిక నీలిమా ఆసుపత్రికి, మాధవిని యశోదా ఆసుపత్రికి స్థానికులు తరలించారు. మాధవి పరిస్థితి విషమంగా ఉంది.
Go Back to Shorts
sandeep
madhavi
murder attack
erragadda

More Telugu News