నిర్మాతలను కుక్కతో పోల్చిన సినిమాటోగ్రాఫర్.. నేడు తేలనున్న వివాదం!
- ఫన్నీ ట్వీట్ చేసిన సంతోష్ శివన్
- నిర్మాతల మండలికి ప్రొడ్యూసర్ల ఫిర్యాదు
- నేడు సమావేశమై చర్చించనున్న మండలి
ఈ మెమెలో ‘హీరోయిన్ కు రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు నిర్మాతలు’ అనే క్యాప్షన్ కింద ప్రేమతో ఉన్న కుక్క ఫొటోను, ‘టెక్నీషియన్స్ కు నగదును ఇచ్చేటప్పుడు నిర్మాతలు’ అనే క్యాప్షన్ కింద మరో ఆగ్రహంతో ఉన్న కుక్క ఫొటోను మిక్స్ చేసిన మెమెను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. దీంతో పలువురు నిర్మాతలు సంతోష్ పై తమిళ సినీ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అప్రమత్తమైన శివన్ ట్వీట్ ను డిలీట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విషయమై ఈరోజు సమావేశం కానున్న నిర్మాతల మండలి దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.