medical shops: ఈ నెల 28న మెడికల్ షాపుల దేశవ్యాప్త బంద్!

  • ఆన్‌లైన్ విక్రయాలకు నిరసనగా బంద్
  • పిలుపునిచ్చిన ఆలిండియా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌
  • నూతన విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
ఈ నెల 28న దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు సీమాంధ్ర కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు తటవర్తి కృష్ణమూర్తి తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో మందుల విక్రయాలపై ప్రభుత్వం తీసుకు వస్తున్న నూతన ఫార్మసీ విధానాన్ని నిరసిస్తూ ఆలిండియా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ-కామర్స్ విధానంలో మందుల విక్రయంపై నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేయనున్నట్టు హెచ్చరించింది. కాగా, మంగళవారం సీమాంధ్ర అసోసియేషన్ బంద్‌కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను విడుదల చేసింది.
medical shops
India
Andhra Pradesh
Bandh
Telangana

More Telugu News