Miryalaguda: ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని ధీమాగా... పోలీసుల ముందు మారుతీరావు దర్జా!

  • ప్రణయ్ హత్యకు ప్రధాన కుట్రదారు మారుతీరావు
  • మీడియా ముందుకు వచ్చిన నిందితులు
  • ధీమాగా ఉన్నట్టు కనిపించిన ఏ-1 ముద్దాయి
మారుతీరావు... తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన పరువుహత్య కేసులో ప్రధాన నిందితుడు. అయితేనేం, పోలీసుల ముందు తన దర్జాను చూపించాడు. దిలాసాగా కనిపించాడు. అమృత వర్షిణి భర్త ప్రణయ్ హత్య కేసులో నిందితులను మీడియాముందు ప్రవేశపెట్టిన వేళ, మారుతీరావు తన చేతులను ప్యాంటు జేబులో పెట్టుకుని దర్జాగా కనిపించాడు. తానెంతో ధీమాగా ఉన్నట్టు ప్రవర్తించాడు.

కేసును విచారిస్తున్న సమయంలోనూ అతను అదే విధమైన హావభావాలతో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. తన లక్ష్యం నెరవేరిందన్న భావన అతని ముఖంలో అనుక్షణం కనిపిస్తోందని, పశ్చాత్తాపం ఏమాత్రం కనిపించలేదని తెలిపారు. కాగా, ప్రణయ్ హత్యకు కుట్ర చేసిన మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్ లు ఈ నాలుగు రోజుల్లో పక్కపక్కనే ఉన్నా, ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదని, ఇది తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని పోలీసు అధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం.
Miryalaguda
Pranay
Marutirao
Police

More Telugu News