JC Diwakar Reddy: ఈ వీడియో చూడండి ప్లీజ్.. మీకే అర్థమవుతుంది: చంద్రబాబును కోరిన జేసీ

  • అసెంబ్లీలో చంద్రబాబును కలిసిన జేసీ
  • తన కోసం పది నిమిషాలు కేటాయించాలని విజ్ఞప్తి
  • తాను చూపించే వీడియో చూడాలని పట్టు
తన కోసం పది నిమిషాలు కేటాయించి తాను చూపించే వీడియోను చూడాలని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో సీఎంను కలుసుకున్న జేసీ తాను చూపించే వీడియోను చూసి తీరాల్సిందేనని అన్నారు. ఓ పది నిమిషాలు కేటాయించి వీడియోను చూస్తే ఎవరెలాంటివారో తెలుస్తుందన్నారు. కొందరు మీకు అవాస్తవాలు చెబుతున్నారని, ఈ వీడియో చూస్తే ఎవరేమిటో తెలుస్తుందని జేసీ అన్నారు. అయితే, చంద్రబాబు ఆ వీడియోను చూసిందీ, లేనిదీ తెలియరాలేదు.
JC Diwakar Reddy
Andhra Pradesh
Anantapur District
Chandrababu
Amaravathi

More Telugu News