Andhra Pradesh: పోలీస్ స్టేషన్లో స్పీకర్ కోడెల తనయుడి హల్ చల్.. తన వర్గీయులను విడిచిపెట్టాలంటూ వాగ్వాదం!

  • వైసీపీ-టీడీపీ వర్గీయుల గొడవ
  • టీడీపీ నేత కొండలు అరెస్ట్
  • విడుదల చేయాలన్న స్పీకర్ తనయుడు
ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామకృష్ణ పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేశారు. తన వర్గీయులను అరెస్ట్ చేయడానికి మీకెంత ధైర్యమంటూ పోలీసులపై చిందులేశారు. వెంటనే వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని ఎడ్వర్డుపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రామానికి చెందిన వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ కొలికొండ కొండలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కొండలును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న శివరామకృష్ణ డీఎస్పీ కె.నాగేశ్వరరావుతో వాగ్వివాదానికి దిగారు. కొండలును ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. కొండలును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత డీఎస్పీ సర్ది చెప్పడంతో శివరామకృష్ణ, టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Andhra Pradesh
Kodela sivaprasad
Sivaram
Rompicharla

More Telugu News