ponguleti srinivas reddy: ఎంపీ పొంగులేటి వ్యాపార సంస్థలపై ఐటీ అధికారుల దాడులు

  • పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాపార సంస్థలపై దాడులు
  • హైదరాబాదులో 6 చోట్ల, ఖమ్మంలో 12 చోట్ల తనిఖీలు
  • వైసీపీ తరపున గెలుపొంది, టీఆర్ఎస్ లో చేరిన పొంగులేటి
ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన స్థలాల్లో హైదరాబాదులో 6 చోట్ల, ఖమ్మంలో 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో ఉదయం 9 గంటలకు సోదాలను ప్రారంభించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాఘవ ఇన్ ఫ్రా కార్యాలయంలో కూడా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ సోదాల వెనుక ఎలాంటి ప్రత్యేక కారణాలు లేవని... ఇవన్నీ సాధారణ సోదాలేనని ఐటీ అధికారులు తెలిపారు. 2014లో వైసీపీ తరపున ఎంపీగా గెలుపొందిన పొంగులేటి... 2016లో టీఆర్ఎస్ లో చేరారు. 
ponguleti srinivas reddy
TRS
mp
it
attacks

More Telugu News