jagan: చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించిన రోజా!

  • ప్రజలను 92 శాతం అప్పుల్లో ముంచేశారు
  • లోకేష్ ఆస్తులు మాత్రం 22 రెట్లు పెరిగేలా చేశారు
  • ప్రజలకు జగనన్న వెలుగు చూపిస్తున్నారు
యావత్ దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు 92 శాతం అప్పుల్లో ముంచేశారని... ఆయన కుమారుడు లోకేష్ ఆస్తులు మాత్రం 55 నెలల్లో 22 రెట్లు పెరిగేలా చేశారని విమర్శించారు. రాష్ట్రం రెండున్నర లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి జారుకుందని అన్నారు. పాదయాత్ర ద్వారా కష్టాల్లో ఉన్న ప్రజలకు జగనన్న వెలుగు చూపిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పాలనకు ముగింపు పలికేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని... వచ్చే ఎన్నికల తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు.
jagan
Chandrababu
roja

More Telugu News