విద్యార్థి మహేంద్ర ఆత్మహత్య విషయం విని దిగ్భ్రాంతికి గురైన వైఎస్ జగన్!
- కర్నూలు జిల్లాలో మహేంద్ర ఆత్మహత్య
- యువత సంయమనం పాటించాలన్న జగన్
- రాష్ట్రానికి హోదా తెస్తామని హామీ
ఆపై మహేంద్ర కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన జగన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పక సాధిస్తుందన్న అభయమిచ్చారు. యువత సంయమనంతో ఉండాలని, తొందరపడి ఎటువంటి నిర్ణయాలూ తీసుకోవద్దని జగన్ సూచించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వైకాపా గెలిచి అధికారంలోకి వస్తుందని, హోదాను సాధించి తీరుతామని అన్నారు.