నేడు కూడా వడ్డనే... చుక్కలు చూపుతున్న పెట్రోలు ధర!
- పెట్రోల్ పై 10 పైసల వడ్డన
- 9 పైసల మేరకు పెరిగిన డీజిల్ ధర
- ముంబైలో రూ. 89.54కు పెట్రోలు ధర
దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 82.16కు చేరగా, డీజిల్ ధర రూ. 73.87కు పెరిగింది. పెట్రోలు ధరలు అధికంగా ఉండే ముంబై విషయానికి వస్తే, లీటరు పెట్రోలు ధర రూ. 89.54కు, డీజిల్ రూ. 78.42కు చేరాయి. విజయవాడలో రూ. 86.41కి పెట్రోలు ధర, రూ. 79.30కి డీజిల్ ధర పెరిగింది. గుంటూరులో రూ. 86.61కి పెట్రోలు, రూ. 79.50కి డీజిల్ ధరలు చేరుకున్నాయి.