Ananth Kumar: కేంద్ర మంత్రి అనంత్ కుమార్‌కు అస్వస్థత.. చికిత్స కోసం లండన్‌కు!

  • కర్ణాటక ఎన్నికల సమయంలో అస్వస్థత
  • పాంక్రియాటిక్ కేన్సర్ తో బాధపడుతున్నట్టు వార్తలు  
  • అలాంటిదేమీ లేదన్న మంత్రి కార్యాలయం
తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న కేంద్రమంత్రి అనంత్ కుమార్ చికిత్స కోసం రెండు వారాల కిందట లండన్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మేలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికలయ్యాక చికిత్స తీసుకోవాలని భావించారు. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారడంతో లండన్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన గత కొంత కాలంగా పాంక్రియాటిక్ కేన్సర్ తో బాధపడుతున్నారని వార్తలొస్తున్నాయి.

అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని ఆయన కార్యాలయం పేర్కొంది. అవన్నీ ఒట్టి వదంతులేనని కొట్టి పడేసింది. మంత్రి లండన్ వెళ్లడం నిజమేనని, అయితే చికిత్స కోసం కాదని స్పష్టం చేసింది. లండన్‌లో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లారని, వారంలోనే మంత్రి తిరిగి వస్తారని పేర్కొంది. మరోవైపు, మంత్రి బాగానే ఉన్నారని కార్యాలయం చెబుతున్నప్పటికీ ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బందిగానే ఉందని, లండన్ నుంచి అమెరికాకు తరలించే అవకాశం కూడా ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
Ananth Kumar
treatment
London
America
pancreatic cancer

More Telugu News