Manoj manchui: నీతులు చెప్పడానికే బాగుంటాయన్న నెటిజన్.. ఘాటుగా స్పందించిన మంచు మనోజ్

  • పనికిమాలిన స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దన్న నెటిజన్
  • ఇంకో వందేళ్ల తర్వాత కూడా కుల పిచ్చి ఉంటుందని వ్యాఖ్య
  • నంబరు ఇస్తే మగాళ్లలా మాట్లాడుకుందామన్న మనోజ్
ప్రణయ్ హత్యను నిరసిస్తూ టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ చేసిన ట్వీట్‌పై ఓ నెటిజన్ తీవ్రస్థాయిలో స్పందించాడు. నీతులు చెప్పడానికే బాగుంటాయని, ఆచరణలోకి వచ్చేసరికి పనికిరాకుండా పోతాయని  ట్వీట్ చేశాడు. ఇన్ని నీతులు చెబుతున్న నీవెందుకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లాడలేదని మనోజ్‌ను ప్రశ్నించాడు. ఒకవేళ అదే జరిగితే నీ తండ్రి రియాక్షన్ ఏంటో నీకు తెలిసొచ్చేదని పేర్కొన్నాడు. ఇకపై ఇలాంటి పనికిమాలిన స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దంటూ విరుచుకుపడ్డాడు. మరో వంద సంవత్సరాలు గడిచినా ఈ దేశంలో కులం, మత జాడ్యం పోదని, అవి శాసిస్తూనే ఉంటాయని పేర్కొన్నాడు.

అతడి ట్వీట్‌పై మనోజ్ ఘాటుగా స్పందించాడు. నీ కోసం మళ్లీ పెళ్లి చేసుకోవడం కష్టమని, నంబరు ఇస్తే డైరెక్ట్‌గా మాట్లాడుకుందామని మనోజ్ ట్వీట్ చేశాడు. మగాళ్లలా మాట్లాడుకుందామని, మీ ఆలోచనలకు జోహార్లని పేర్కొన్నాడు. మనోజ్ ట్వీట్‌కు మద్దతుగా పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Manoj manchui
Tollywood
Pryanay
Miryalaguda
Murder
Twitter

More Telugu News