kishan teddy: టీఆర్ఎస్ కు కొత్త నిర్వచనం చెప్పిన కిషన్ రెడ్డి

  • ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ మట్టిలో కలిపారు
  • తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని మాట తప్పారు
  • టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల పార్టీ
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్... మాట తప్పారని బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలన్నింటినీ మట్టిలో కలిపిన కేసీఆర్ కు... ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా లేదని అన్నారు.

 బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను భ్రమిత్ షా అంటూ కేసీఆర్ కుటుంబసభ్యులు అంటుండటం... వారి అహంకారానికి, అవివేకానికి నిదర్శనమని చెప్పారు. బీజేపీని జూటా పార్టీ అనడం కేటీఆర్ అవివేకానికి ఉదాహరణ అని అన్నారు. బీజేపీ జూటా పార్టీ అయితే... టీఆర్ఎస్ తెలంగాణ రజాకార్ల పార్టీ అవుతుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని... అందుకే తమ పార్టీని అన్ని పార్టీలు టార్గెట్ చేశాయని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో సభలను నిర్వహిస్తామని చెప్పారు. 
kishan teddy
kcr
KTR
TRS
bjp

More Telugu News