అల్లు అర్జున్ అంతే .. దేన్నీ లెక్కచేయడు: బన్నీవాసు
- ఆ రోజు ఉదయమే సర్జరీ జరిగింది
- సాయంత్రానికి బెంగుళూర్ వెళదామన్నాడు
- ఎంతగా చెప్పినా వినిపించుకోలేదు
'గంగోత్రి' సినిమా సమయంలో .. మర్నాడు ఉదయం షూటింగ్ అనగా ఆ రోజు ఉదయం అల్లు అర్జున్ 'టాన్సిల్స్ సర్జరీ' చేయించుకున్నాడు. ఎంతమాత్రం రెస్ట్ తీసుకోకుండా, ఆ సాయంత్రమే బెంగుళూర్ వెళ్లి సినిమాకి కావలసిన తన కాస్ట్యూమ్స్ తెచ్చుకుందామని అన్నాడు. ఒకమాట ఇంట్లో చెప్పి వెళదామని అన్నాగాని వినిపించుకోలేదు. సినిమా పట్ల ఆయనకి గల అంకితభావం అలాంటిది .. ఆ విషయంలో ఆయన దేన్నీ లెక్కచేయడు" అని చెప్పుకొచ్చాడు.