Telangana: రాజీనామా చేద్దామంటే పారిపోయినోళ్లు కూడా ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు!: బీజేపీపై నాయిని ఫైర్

  • ఉద్యమంలో బీజేపీ పాత్ర ఎక్కడుంది?
  • తెలంగాణ కోసం పోరాడింది కేసీఆరే
  • విలీన దినోత్సవంలో పాల్గొన్న నాయిని
తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదంటూ బీజేపీ చేస్తున్న విమర్శలపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామాలు చేద్దాం.. కలసి రండి అనగానే బీజేపీ నేత కిషన్ రెడ్డి పారిపోయాడని ఎద్దేవా చేశారు. అలాంటి నేతలు ఇప్పుడు విమోచన దినం గురించి మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో అసలు బీజేపీ పాత్రే లేదని నాయిని స్పష్టం చేశారు.

ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన తెలంగాణ విలీన దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను నాయిని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణను తీసుకొచ్చాడని అన్నారు. టీఆర్ఎస్ పై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని బీజేపీ నేతలకు హితవు పలికారు.
Telangana
TRS
nayini narasimha reddy
BJP
resign
jump

More Telugu News