Telangana: మైనర్‌ బాలికపై యువకుడి లైంగిక దాడి: పొలాల్లోకి తీసుకువెళ్లి బలవంతం

  • బాధితురాలు తొమ్మిదో తరగతి విద్యార్థిని
  • ప్రేమ పేరుతో వెంట పడుతున్న నిందితుడు
  • సిద్ధిపేటలో ఇటీవల జరిగిన ఘటన
ప్రేమ పేరుతో ఓ మైనర్‌ బాలిక వెంట పడుతున్న యువకుడు అవకాశం చూసుకుని ఆమెను పొలాల్లోకి బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు... తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా శివరంపురానికి చెందిన ఓ కుటుంబం నగరానికి వలస వచ్చింది. బాలిక తండ్రి రామకృష్ణాపురంలోని ఓ అపార్ట్‌మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలు తొమ్మిదో తరగతి చదువుతోంది.

ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రాజు (25) కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల బాధిత బాలిక బోనాలకు సిద్ధిపేటలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన రాజు ఆ ఊరెళ్ళాడు. ఎవరూ లేని సమయంలో బాలికను సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది తెలిసిన బాలిక తల్లిదండ్రులు నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Telangana
mainor raped
Siddipet District

More Telugu News