ఢిల్లీ జేఎన్‌యూ ఎన్నికల్లో సత్తా చాటిన హైదరాబాదీ.. అధ్యక్షుడిగా ఎన్నికైన సాయి బాలాజీ!
- ఆదివారం వెల్లడైన ఫలితాలు
- నాలుగు ప్యానెళ్లను గెలుచుకున్న ఐక్య వామపక్ష కూటమి
- ఉపాధ్యక్షురాలిగా సారిక చౌదరి
ఈ ఎన్నికల్లో యునైటెడ్ లెఫ్ట్ మొత్తం నాలుగు కేంద్ర ప్యానెళ్లను సొంతం చేసుకుంది. సాయిబాలాజీ అధ్యక్షుడిగా ఎన్నికవగా, డీఎస్‌ఎఫ్ నేత సారిక చౌదరి ఉపాధ్యక్షురాలిగా, ఎస్ఎఫ్ఐకి చెందిన ఎజాజ్ అహ్మద్ ప్రధాన కార్యదర్శిగా, ఏఐఎస్ఎఫ్‌కు చెందిన అముత జయదీప్ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు.