Nara Lokesh: చైనా పర్యటనకు బయలుదేరిన మంత్రి లోకేశ్

  • న్యూ చాంపియన్స్‌ వార్షిక సమావేశాలకు హాజరు
  • నేటి సాయంత్రం బీజింగ్‌ చేరుకోనున్న యువనేత
  • రాత్రి ప్రవాసాంధ్రులతో భేటీ
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ శనివారం చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక న్యూ చాంపియన్స్‌ వార్షిక సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఈనెల 18 నుంచి 20వ తేదీ మధ్య మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. నేటి సాయంత్రం బీజింగ్‌ చేరుకోనున్న లోకేశ్ రాత్రి ఏడెనిమిది గంటల మధ్య అక్కడి ప్రవాస భారతీయులతో భేటీ అవుతారు.

సోమవారం సీఈటీసీ, బీవైడీ-ఈవీ బ్యాటరీ తయారీ, జియోమీ సప్లయిర్స్‌తోపాటు మరికొన్ని కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. 20న ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.  ఈ సందర్భంగా పలు ఒప్పందాలకు సంబంధించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. 22న తిరిగి ఆంధ్రప్రదేశ్‌ చేరుకుంటారు. 
Nara Lokesh
Telugudesam

More Telugu News