Manoj Prabhakar: నన్ను క్షమించి వదిలేయండి: మహేష్ బాబు నటనపై కామెంట్లు చేసిన స్టాండింగ్ కమెడియన్ మనోజ్!

  • మహేష్ నటన బాగాలేదని చెప్పిన మనోజ్ ప్రభాకర్
  • ఫ్యాన్స్ ట్రోలింగ్ తో క్షమాపణలు చెప్పిన వైనం
  • తానూ మనిషినేనని, తప్పులు చేస్తానని అన్న మనోజ్
ట్రాలీవుడ్ హీరో మహేష్ బాబు గురించి అనుచిత కామెంట్లు చేసి, లక్షలాది మంది అభిమానుల ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్న తమిళ స్టాండింగ్ కమెడియన్ (వేదికలపై మైక్ ముందు జోక్స్ వేస్తూ నవ్వించే కమెడియన్) మనోజ్ ప్రభాకర్, మహేష్ బాబుకు, ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పారు. 'స్పైడర్' సినిమాలో మహేష్ నటన బాగాలేదని, విలన్ ఎస్ జే సూర్య బాగా నటించాడని, మహేష్ కన్నా సినిమాలో కనిపించిన రాళ్లు బాగా నటించాయని మనోజ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీంతో ఫేస్ బుక్ లో క్షమాపణలు చెబుతూ మనోజ్ ఓ పోస్టు పెట్టాడు. మాక్ అవార్డు షోలో భాగంగా ఆ వీడియోను తయారు చేశారని, తాను 'స్పైడర్' తమిళ వర్షన్ చూసి అభిప్రాయాలు చెప్పానని, ఎవరినీ నొప్పించాలని ఆ కామెంట్లు చేయలేదని చెప్పాడు.

ఆ కామెంట్స్ తన వ్యక్తిగత అభిప్రాయమని, ఓ పాత్రను సరిగ్గా పోషించలేదని చెబితే, దానర్థం అతను చెత్తనటుడని కాదని అన్నారు. తాను అసహ్యంగా ఉంటానని వస్తున్న కామెంట్ల గురించి ప్రస్తావిస్తూ, ఆ విషయం తనకూ తెలుసునని చెప్పాడు. తన కుటుంబీకులు, స్నేహితులను టార్గెట్ చేస్తున్నారని వాపోయాడు. తన మాటలు ఎవరినైనా బాధించివుంటే క్షమించాలని వేడుకున్నాడు. మహేష్ బాబుకు, ఆయన ఫ్యాన్స్ కు క్షమాపణలు చెబుతూ, తానూ మనిషినేనని, తప్పులు చేయడం సహజమని, తానిప్పుడు నేర్చుకుంటున్నానని అన్నాడు. ఈ విషయంలో తాను ముందుగానే స్పందించివుంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదని భావిస్తున్నట్టు చెప్పాడు.
Manoj Prabhakar
Spider
Tollywood
Mahesh Babu

More Telugu News