ఆసియాకప్ ఆరంభంలోనే సంచలనం... శ్రీలంకపై బంగ్లాదేశ్ ఘన విజయం!
- తొలుత బ్యాటింగ్ చేసి 261 పరుగులు చేసిన బంగ్లాదేశ్
- 124 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
- 137 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ భారీ విజయం
ఆపై 262 పరుగుల కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక తడబడింది. తరంగ 27, కుశాల్ మెండిస్ 0, కుశాల్ పెరీరా 11, ధనుంజయ డిసిల్వా 0, మాధ్యూస్ 16, శనక 7, తిసార పెరీర 6, దిల్రువాన్ 29, లక్మల్ 20, అఫోన్సో 4, మలింగ 3 పరుగులు మాత్రమే చేశారు. 35.2 ఓవర్లలోనే 124 పరుగులకు శ్రీలంక ఆలౌట్ కాగా, బంగ్లాదేశ్ జట్టు 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, నేడు పాకిస్థాన్, హాంకాంగ్ మధ్య పోరు జరగనుంది.