రాసలీలల రాజయ్య మాకొద్దు.. పార్టీ టికెట్ ను కడియం శ్రీహరికే ఇవ్వండి!: టీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన
- రాజయ్యకు టికెట్ ఇవ్వడంపై అసంతృప్తి
- ఆయన వస్తే పార్టీ చిత్తుగా ఓడిపోతుందని వ్యాఖ్య
- రెండు సార్లు గెలిపించినా పట్టించుకోలేదని వెల్లడి
రాజయ్య తప్ప ఇక్కడ ఎవరు పోటీచేసినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. గత ఐదేళ్లలో కడియం శ్రీహరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనీ, ఆయనకే మరోసారి టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. రాజయ్య కనీసం పార్టీని, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అవినీతి, రాసలీలలకు కేరాఫ్ గా మారిన రాజయ్యకు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించవద్దని విజ్ఞప్తి చేశారు. 2001 నుంచి రెండు సార్లు రాజయ్యను గెలిపించినా తమను పట్టించుకోలేదని వాపోయారు.