తెలంగాణలో కేసీఆరే బాద్ షా.. 'ఇండియాటుడే' సర్వేలో వెల్లడి!
- అన్నివర్గాలను ఆకట్టుకున్న టీఆర్ఎస్ అధినేత
- ప్రతికూలత కేవలం 16 శాతమే
- ఇబ్బందిపెడుతున్న నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 7,110 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వేను రూపొందించారు. పారిశుద్ధ్యం, నిరుద్యోగం, వ్యవసాయ ఇబ్బందులు, నిత్యావసరాల ధరల పెరుగుదల తమ ప్రధాన సమస్యలని ప్రజలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు బాగుందని ఏకంగా 48 శాతం ప్రజలు తెలిపారు. బాగోలేదని కేవలం 16 శాతం మంది మాత్రమే వెల్లడించారు. తదుపరి ప్రధానిగా మోదీకి 44 శాతం మంది, రాహుల్ కు 39 శాతం మంది మద్దతు తెలిపారు. ఈ రేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చేరిపోయారు. కేసీఆర్ దేశ ప్రధాని కావాలని దాదాపు 11 శాతం మంది ప్రజలు కోరుకోవడం గమనార్హం.