ఢిల్లీకి రండి.. తెలంగాణ ముఖ్య నేతలకు కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు!

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా స్పీడు పెంచింది. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానం తెలంగాణ ముఖ్య నేతలను ఢిల్లీకి రమ్మని పిలిచింది. వీరితో రేపు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశం అవుతారు. ఈ భేటీలో ముందస్తు ఎన్నికలు, పొత్తులు, అభ్యర్థుల ఎంపిక తదితర విషయాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.

అధిష్ఠానం పిలుపు మేరకు ఇప్పటికే డీకే అరుణ, కోమటిరెడ్డి సోదరులు సహా పలువురు ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు వెళుతున్నారు. ఈ చర్చానంతరం దాదాపు 40 మంది అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాహుల్‌ను కలిసిన సీనియర్ నేతలు తెలంగాణలో పరిస్థితులను వివరించారు. 


More Telugu News