‘వాహిని’ వల్లే ఎంతో మంది నటులు వచ్చారు!: రావి కొండలరావు
- వాహిని లేకుంటే తెలుగుసినీ పరిశ్రమ వుండేది కాదు
- సినిమాల్లో ఆరోగ్యకరమైన హాస్యం కొరవడుతోందని వ్యాఖ్య
- ‘వాహిని’ చరిత్రపై ఈ రోజు పుస్తకావిష్కరణ
ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన హాస్యం కరవైపోయిందని కొండలరావు అన్నారు. వాహిని స్టూడియో గొప్పతనం, చరిత్ర, సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలతో ‘వాహిని’ అనే పుస్తకాన్ని తాను రాశానని తెలిపారు. కళాభారతి ఆడిటోరియంలో ఈ రోజు సాయంత్రం ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. తాను ఇప్పటివరకూ 600 సినిమాల్లో నటించానని కొండలరావు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఓ సినిమాలో నటిస్తున్నాననీ, మరో చిత్రం సెట్ పైకి వెళ్లాల్సి ఉందని చెప్పారు.