Rajiv Gandhi: రాజీవ్‌ హంతకుల విడుదల సిఫార్సుకు ఏజీ సూచనే ప్రాతిపదిక?

  • ఆ మేరకే తమిళనాడు క్యాబినెట్‌ నిర్ణయం
  • గతంలో రాష్ట్ర విజ్ఞప్తిని తిరస్కరించిన కేంద్రం
  • తాజాగా మరోసారి నిర్ణయం
రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషుల విడుదల విషయంలో సంచలన సిఫార్సు చేసిన తమిళనాడు నిర్ణయం వెనుక అడ్వకేట్ జనరల్ నారాయణ్ వ్యక్తం చేసిన అభిప్రాయమే ప్రాతిపదికని తెలుస్తోంది. మాజీ ప్రధాని హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఏడుగురి విడుదలకు తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఇటువంటి సిఫార్సును కేంద్రం తిరస్కరించింది. రాజ్యాంగంలోని 161వ అధికరణం కింద ఖైదీల విడుదలపై నిర్ణయం తీసుకునే ‘అపరిమిత అధికారం’ గవర్నర్‌కు ఉంది. దీని ఆధారంగానే ప్రభుత్వం చొరవ తీసుకుందని భావిస్తున్నారు. 
Rajiv Gandhi
Tamilnadu

More Telugu News