జూనియర్ ఎన్టీఆర్ సినిమా వేడుకకు ఊహించని అతిథి!
- శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న 'అరవింద సమేత'
- ఈ నెల 20న హైదరాబాదులో ఆడియో ఫంక్షన్
- చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్న అమితాబ్ బచ్చన్
ఈ వేడుకకు బాలయ్య లేదా మహేష్ బాబులలో ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ గా హాజరవుతారనే వార్తలు నిన్నటిదాకా వినిపించాయి. అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో అమితాబ్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషించారట. అయితే, సినిమా విడుదల వరకు ఈ అంశాన్ని సీక్రెట్ గా ఉంచాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి, ఇందులో ఎంత నిజం ఉందో... వేచి చూడాల్సిందే.