జపాన్ బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లను రాబడుతున్న ‘మగధీర’
- జపాన్లో విడుదలైన మగధీర మూవీ
- రిలీజైన పది రోజుల్లోనే రూ.17 కోట్ల వసూళ్లు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘మగధీర’ ఫొటోలు
ఈ చిత్రం కూడా జపాన్ ప్రజలను బాగానే ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం రిలీజైన పది రోజుల్లోనే రూ.17 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల బాహుబలి సినిమా సమయంలో సుబ్బరాజుతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు అక్కడి ప్రేక్షకులు. అప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో.. ఇప్పుడు మగధీరకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో అంతగానూ వైరల్ అవుతున్నాయి. సినిమా తమకెంతో నచ్చిందని దర్శకధీరుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.