మోదీ ప్రభుత్వం అన్ని పరిమితులను దాటేసింది.. దేశాన్ని కాపాడేందుకు మేమంతా ఏకమయ్యాం!: మన్మోహన్ సింగ్
- దేశ ప్రయోజనాలు, ఐక్యతకు విఘాతం కలిగించే పనులు చాలా చేశారు
- దేశ ఐక్యతను కాపాడేందుకు విపక్షాలు ఏకమయ్యాయి
- మోదీ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి
అన్ని పార్టీలు తమ పాత సమస్యలను పక్కన పెట్టేశాయని, ఇప్పుడు ఐక్యంగా కలసి ముందుకు సాగేందుకు సిద్ధమయ్యాయని మన్మోహన్ తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన భారత్ బంద్ కు విపక్షంలో ఉన్న దాదాపు 21 పార్టీలు మద్దతు ప్రకటించాయి. పతనమవుతున్న రూపాయి విలువ, ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలను నిరసిస్తూ విపక్షాలు భారత బంద్ ను చేపట్టాయి.