YSRCP: నా దగ్గర డబ్బులే లేవు.. జగన్ అంత పెద్ద మొత్తం ఇవ్వలేదు: ప్రశాంత్ కిషోర్

  • ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు
  • జగన్ నుంచి రూ. 300 కోట్లు తీసుకున్నానన్న వార్తలు అవాస్తవం
  • హైదరాబాద్ లో స్పష్టం చేసిన ప్రశాంత్ కిషోర్
తన కంపెనీలో ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి)లో జరిగిన లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన, జగన్ నుంచి తాను పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని, ఎన్నికల్లో విజయానికి సహకరిస్తున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. ఇవన్నీ పుకార్లేనని, వీటిల్లో నిజం లేదని ఆయన అన్నారు.

జగన్ తనకు రూ. 300 కోట్లు, రూ. 400 కోట్లు ఇచ్చి వ్యూహకర్తగా నియమించుకున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. జగన్ తనకేమీ అంత మొత్తం ఇవ్వలేదని తెలిపారు. పంజాబ్, బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వేళ, అటు అమరేందర్ సింగ్, ఇటు నితీష్ కుమార్ ల వద్ద ఎన్నికల ఖర్చునకు సరిపడా నిధులు లేవని ప్రశాంత్ వ్యాఖ్యానించడం గమనార్హం.
YSRCP
Jagan
Prashant Kishore

More Telugu News