samantha: ఫొటో అయినా, వీడియో అయినా చైతూ అనుమతితోనే పోస్టింగ్‌: సమంత

  • భర్త ఫొటోల పోస్టింగ్ పై వివరణ 
  • పెళ్లి తర్వాత నా బలం పెరిగిందంటున్న ముద్దుగుమ్మ
  • ఈనె 13న విడుదల కానున్న సామ్‌ నటించిన ‘యూటర్న్‌’
సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్స్‌ పెట్టే విషయంలో చురుకుగా వ్యవహరించే అగ్ర కథానాయిక సమంత తన భర్త, హీరో చైతన్య విషయంలో మాత్రం అతని అనుమతి లేకుండా ఏ పనీ చేయనంటోంది. సోషల్‌ మీడియాలో చైతూకి సంబంధించిన వీడియో అయినా, ఫొటో అయినా పెట్టాలంటే ముందు అతని అనుమతి కోరతానని చెబుతోందీ ముద్దుగుమ్మ.

తనతోపాటు చైతన్య చిత్రాల విషయాలే కాదు, వ్యక్తిగత విషయాలను కూడా సామ్‌ అప్పుడప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సమంత నటించిన కన్నడ రీమేక్‌ ‘యూ టర్న్‌’ ఈ నెల 13న విడుదవుతోంది. ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. చైతన్య నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ కూడా అదే రోజు విడుదలవుతోంది.
samantha
nagachaitanya
Tollywood
Hyderabad

More Telugu News