పశువులకూ ఆధార్ లింక్ : సూరత్ నగర పాలక సంస్థ నిర్ణయం
- వీధుల్లోకి విచ్చలవిడిగా వదిలేయకుండా కట్టడికి నిర్ణయం
- గోమాత చెవులకు గుర్తింపు బిళ్ల
- యజమాని యూనిక్ ఐడీతో అనుసంధానం
ఇప్పటికే 25 వేల పశువులను గుర్తించి వాటి యజమానుల ఆధార్‌తో అనుసంధానించారు. రోడ్లపై పశువులను వదిలేస్తే ఒక్కోదానికి రోజుకి రూ.1800 జరిమానా విధిస్తున్నారు. పశువులు రోడ్లపై ఇష్టానుసారం తిరగడం వల్ల ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు ఈ నిర్ణయంతో చెక్ చెప్పవచ్చునని నగరపాలక సంస్థ అధికారులు భావిస్తున్నారు.