దొంగ, అబద్ధాల కోరు... కన్నీటిపర్యంతమవుతూ అంపైర్ ను తిట్టిన సెరీనా విలియమ్స్!
- యూఎస్ ఓపెన్ ఫైనల్స్ లో నాటకీయ పరిణామాలు
- 6-2, 6-4 తేడాతో ఓడిపోయిన సెరీనా విలియమ్స్
- గ్రాండ్ స్లామ్ గెలిచిన తొలి జపాన్ క్రీడాకారిణిగా నిలిచిన ఒసాకా
- ఓటమిని తట్టుకోలేక సహనాన్ని కోల్పోయిన సెరీనా
తొలి సెట్ ను కోల్పోయిన తరువాత సెరీనా విలియమ్స్ తన సహనాన్ని కోల్పోయింది. ఆమె తన కోచ్ ని సంప్రదించడంపై అభ్యంతరం చెప్పిన చైర్ అంపైర్ కార్లోస్ రామోస్ పై విరుచుకుపడింది. కోపంతో రంకెలేసింది. "నువ్వో అబద్ధాల కోరువి. దొంగవి. నాకు క్షమాపణలు చెప్పాల్సిందే" అంటూ రెచ్చిపోయింది. అంతకుముందు తన రాకెట్ ను బలంగా నేలకేసి కొట్టి విరిచింది. సెరీనా క్రమశిక్షణను ఉల్లంఘించినందున ఓ పెనాల్టీ పాయింట్ ను, చైర్ అంపైర్ ను దూషించినందుకు గేమ్ పెనాల్టీనీ విధించారు. మ్యాచ్ లో ఓటమి అనంతరమూ సెరీనా, యూఎస్ ఓపెన్ నిర్వాహకులపై విరుచుకుపడింది. మహిళలపై వివక్ష చూపిస్తున్నారని వాపోయింది.