నాడు కవిత, కేటీఆర్ నా దగ్గరకొచ్చి మాట్లాడిన మాటలు మర్చిపోలేదు!: మధు యాష్కీ
- నాడు కేసీఆర్ ‘నిమ్స్’లో ఉన్నప్పటి విషయమిది
- 2009 డిసెంబరు 9న వాళ్లిద్దరూ నా దగ్గరకొచ్చారు
- ప్రకటన చాలన్నారు, లేకపోతే ప్రాణాలు పోయేట్టు ఉన్నాయన్నారు
‘నెహ్రూ, గాంధీ కుటుంబాలు దేశం కోసం తమకు ఉన్న ఆస్తులను త్యాగం చేశాయి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు 2001కు ముందున్న ఆస్తి ఎంత? ఇప్పుడున్న ఆస్తి ఎంత? తెలంగాణ ప్రజలను మోసగించి ఆస్తులు గడించుకుంది నువ్వా? లేక కాంగ్రెస్ పార్టీనా?.. ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి.. రాహుల్ గాంధీని ‘బఫూన్’ అంటూ ఒక బేవకూఫ్ మాటలు మాట్లాడుతున్నావు’ అని మధుయాష్కీ మండిపడ్డారు.