Rahul Gandhi: దేశంలోనే ఓ పెద్ద బఫూన్ రాహుల్ గాంధీ: కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

  • రాహుల్ ఏంటో అందరికీ తెలుసు!
  • లోక్ సభలో మోదీ దగ్గరకు వెళ్లి హత్తుకున్నారు
  • ఆ తర్వాత కన్ను కొట్టడం దేశమంతా చూసింది
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఏంటో అందరికీ తెలుసని, దేశంలోనే ఓ పెద్ద బఫూన్ రాహుల్ అని, లోక్ సభలో నరేంద్ర మోదీ దగ్గరకు వెళ్లి ఆయన్ని హత్తుకోవడం, ఆ తర్వాత కన్ను కొట్టడం దేశమంతా చూసిందని విమర్శించారు. హైదరాబాద్ లో రాహుల్ ఇటీవల పర్యటించడంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రాహుల్ ఎన్నిసార్లు పర్యటిస్తే తమకు అంత మంచిదని, మరిన్ని ఎక్కువ స్థానాలను తాము గెలుచుకుంటామని అన్నారు.
Rahul Gandhi
kcr

More Telugu News