ప్రియురాలి కోసం విజయవాడ నుంచి బ్యాచ్ తో వచ్చిన యువకుడు... బంజారాహిల్స్ లో వీరంగం!
- బీటెక్ చదివేరోజుల్లో యువతితో ప్రేమ
- మరొకరికి సన్నిహితంగా ఉంటోందని గొడవకు వచ్చిన యువకుడు
- ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
తాను ప్రేమించిన అమ్మాయి మరొకరికి దగ్గరైందన్న ఆగ్రహంతో ఉన్న రేవంత్, గత కొన్ని రోజులుగా, ఆమెతో ఫోన్ లో మాట్లాడుతూ, బెదిరిస్తున్నాడు. ఆమెను విజయవాడ పంపాలని అఖిల్ నూ హెచ్చరించాడు. ఈ క్రమంలో నిన్న తెల్లవారుజామున 10 మంది స్నేహితులను వెంటేసుకుని విజయవాడ నుంచి వచ్చిన రేవంత్, అఖిల్ తో గొడవపడ్డాడు. అఖిల్ స్నేహితులు కూడా రావడంతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, రేవంత్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. తాను ఐఈఎల్టీఎస్ కు ప్రిపేర్ అయ్యేందుకు హైదరాబాద్ లో ఉంటున్నానని చెబుతూ, సదరు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్టు తెలిపారు.