kcr: ‘తెలంగాణ’కు కేసీఆర్ కుటుంబం అత్యంత ప్రమాదకరం: రేవంత్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
‘తెలంగాణ’కు కేసీఆర్ కుటుంబం అత్యంత ప్రమాదకరంగా పరిణమించిందని టీ - కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలిగించడం ద్వారా రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, అమరవీరుల కుటుంబాలకు, దళితులకు, మైనార్టీలకు, బలహీన వర్గాల వారికి మేలు చేసినట్టు అవుతుందని, వీళ్లందరికీ సంక్షేమ పథకాలు తీసుకురావడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం గురించి, కుటుంబ పాలన గురించి కేసీఆర్ విమర్శలు చేయడం తగదని అన్నారు. గాంధీ కుటుంబం ప్రధాన మంత్రి పదవిని వదులుకుని ముప్పై సంవత్సరాలు అవుతోందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. 
Go Back to Shorts
kcr
Revanth Reddy

More Telugu News