టీమిండియా విజయలక్ష్యం 245 పరుగులు.. ఆదిలోనే ఇండియాకు ఎదురుదెబ్బ
- రెండో ఇన్నింగ్స్ లో 271 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
- 4 వికెట్లు తీసిన షమీ
- రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన రాహుల్
245 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. మంచి ఫామ్ లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ గా పెవిలియన్ చేరాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ధావన్ 9 పరుగులు, పుజారా 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు వికెట్ నష్టానికి 12 పరుగులు. విజయానికి మరో 233 పరుగులు చేయాల్సి ఉంది.