KTR: ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

  • ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం
  • పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే విషయాన్ని కేసీఆర్ చూసుకుంటారు
  • బీరు, బిర్యానీలు ఇచ్చి ప్రజలను సభలకు తరలించడం కాంగ్రెస్ నైజం
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి సందిగ్ధత తొలగిపోతోంది. ముందస్తు తప్పదనే విషయం స్పష్టమవుతోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ముందస్తుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసే బాధ్యతను తమ అధినేత కేసీఆర్ చూసుకుంటారని చెప్పారు. ఒకే రోజున కేబినెట్ సమావేశం, ఒక భారీ సభను నిర్వహించడం కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనమని అన్నారు.

రాహుల్ గాంధీ సభకు కనీసం 25 వేల మంది కూడా రాలేదని... కానీ టీఆర్ఎస్ కు 46 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారని కేటీఆర్ చెప్పారు. బీరు, బిర్యానీ ఇచ్చి ప్రజలను సభలకు తరలించడం కాంగ్రెస్ పార్టీ నైజమని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళతామని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారి దివాళాకోరుతనానికి నిదర్శనమని చెప్పారు. 
KTR
kcr
TRS
Congress
elections

More Telugu News