Pawan Kalyan: పవన్ నిస్వార్ధపరుడు.. ఈ తరానికి రోల్ మోడల్!: పవర్ స్టార్ పై సమంత ప్రశంసలు

  • బర్త్ డే విషెస్ చెప్పిన సమంత
  • ఈ తరానికి రోల్ మోడల్ అని వెల్లడి
  • ట్విట్టర్ లో స్పందించిన నటి
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ సమంత అక్కినేని పవన్ కు ట్విట్టర్ లో బర్త్ డే విషెస్ చెప్పింది. పవన్ కల్యాణ్ నిస్వార్ధపరుడనీ, ఈ తరానికి రోల్ మోడల్ అని సమంత వ్యాఖ్యానించింది.

  ‘ప్రియమైన పవర్ స్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నిస్వార్ధంగా ఉండటంలో ఈ తరానికి పవన్ ఓ ఉదాహరణ. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం’ అని ట్వీట్ చేసింది. పవన్ కల్యాణ్ కు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తో పాటు మెగా ఫ్యామిలీ హీరోలు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Pawan Kalyan
BIRTHDAY
SAMANTHA
WISHES

More Telugu News