హనీమూన్ కోసం ఊటీకి... రైలు మొత్తాన్ని బుక్ చేసుకున్న బ్రిటిష్ జంట!
- ఇటీవలే పెళ్లి చేసుకున్న విలియమ్ లిన్, సిల్వియా ప్లాసిక్
- హనీమూన్ కోసం ఇండియాను ఎంచుకున్న జంట
- రూ. 3 లక్షలతో రైలును బుక్ చేసుకున్న కొత్త జంట
గ్రాహమ్ విలియమ్ లిన్ (30), సిల్వియా ప్లాసిక్ (27)లకు ఇటీవలే వివాహమైంది. తమ హనీమూన్ ను ప్రత్యేకంగా, జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని భావించింది. ఆ వెంటనే ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా రైలు మొత్తాన్ని బుక్ చేసుకుంది. ఈ జంటకు స్వాగతం పలికి, మంచి రిసెప్షన్ పార్టీ ఇవ్వడానికి మెట్టుపాలయం రైల్వే స్టేషన్ మేనేజర్లు ఏర్పాటు చేశారు. హిల్ టూరిజంను ప్రమోట్ చేసే విషయంలో పలు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్న భారతీయ రైల్వేలు, నీలగిరి కొండల్లో 120 మంది కూర్చుని ప్రయాణించే ప్రత్యేక రైలును నడిపేందుకు కూడా నిర్ణయించింది.